విపక్షాలు ఏకమైతే బీజేపీ ఓటమి ఖాయం: రాహుల్

rahul-gandhi2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. దీనికోసం విపక్షాలన్నీ ఏకం కావాలన్నారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు ఐక్యంగా పోరాడితే వారణాసిలోనూ ప్రధాని మోడీ గెలవలేరన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం లో భాగంగా బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగించారు.

ప్రధాని మోడీ అయినా.. లన మాత్రం ఆరెస్సెస్‌ కనుసన్నల్లో జరుగుతోందని ఆరోపించారు రాహుల్. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో మోడీ ముడుపులు తీసుకున్నారన్నారు. కర్ణాటకకు సీఎంగా సిద్దరామయ్యే ఉంటారని ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ గెలుస్తుందని నేననుకోవటం లేదని… విపక్షాలన్నీ ఏకమైతే అధికార పక్షం గెలవటం అంత సులభం కాదన్నారు. ఇప్పటికే ఐక్య కూటమి ఏర్పాటు ఓ కీలక దశకు చేరుకుందన్నారు. పలు పార్టీల మధ్య చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ అందరికీ కలుపుకుని పోతామన్నారు రాహుల్.

 

 

Posted in Uncategorized

Latest Updates