విభజనపై మోడీ : తలుపులు మూసేసి రాష్ట్రాన్ని విడగొట్టారు

modicongకాంగ్రెస్ నీతి పరంగా ఉంటే దేశం ఎప్పుడో అభివృద్ధి చెందేది అన్నారు ప్రధాని మోడీ. బుధవారం (ఫిబ్రవరి-7) లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఖ‌రి వ‌ల్లే తెలుగు రాష్ట్రాల్లో విభ‌జ‌న స‌మ‌స్య‌లు ఇంకా వెంటాడుతున్నాయ‌న్నారు ప్ర‌ధాని మోడీ. ఎన్నిక‌ల కోసం తొంద‌ర‌ప‌డి విడగొట్టారన్నారు. వాజ్‌పేయి ప్ర‌భుత్వ‌ స‌మ‌యంలో మూడు రాష్ట్రాల‌ను ఇచ్చామ‌ని.. అప్పుడు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాలేద‌న్నారు.

ఉత్త‌రాఖండ్‌, జార్ఖండ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌ల‌తో ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌లేద‌న్నారు. పార్ల‌మెంట్ త‌లుపులు మూసేసి.. ప్రసార మాధ్యమాలను కట్ చేసి మరీ విభ‌జ‌న చేశార‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ఇష్టానుసారం వ్యవహరించిందన్నారు మోడీ. తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు పూర్తి మద్దతు ప్రకటించాం అన్నారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో సరైన చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే నాలుగేళ్లుగా ఇంకా విభజన సమస్యలు ఉన్నాయన్నారు మోడీ. కాంగ్రెస్ స‌రైన దిశ‌లో చ‌ర్య‌లు తీసుకుంటే.. దేశం ఇప్పుడు ఇలా ఉండేది కాద‌న్నారు.  తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సముఖుత తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. మోడీ ప్ర‌సంగిస్తుంటే.. కాంగ్రెస్ స‌భ్యులు నినాదాల‌తో నిరసన వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates