విమర్శలకు సమాధానం చెప్పేలా TTL టోర్నీ: వివేక్ వెంకటస్వామి

vivekరాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం కృషి  చేస్తున్నామన్నరు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు,HCA ప్రెసిడెంట్ జి.వివేక్ వెంకటస్వామి. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించామన్నారు. మొయిన్ ఉద్ దౌల టోర్నీలో మొదటి సారి జిల్లా జట్టుని ఆడించామన్నారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ నిర్వహించాలని ఎప్పటి నుంచో తమ మనసులో ఉండేదని..అందుకే వెంకటస్వామి పేరుతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. టోర్నమెంట్ కోసం విశాక నుంచి 75 లక్షలు స్పాన్సర్ చేస్తోందన్నారు. అయితే దీన్ని చాలా మంది క్రిటిసిస్ చేస్తున్నారు..ఎందుకు అలా చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. గతంలో కోరమండల్ కింగ్ కంపెనీ రూ.15 లక్షలు ఇస్తేనే వారి పేరు టోర్నమెంట్ కు పెట్టారని…అలాంటిది విశాక 75 లక్షలు ఇచ్చింది. అందుకే వెంకటస్వామి పేరు పెట్టామని స్పష్టం చేశారు. మ్చాచ్ లన్నీ BCCI రూల్ ప్రకారమే నిర్వహించాన్నారు. అంతేకాదు టోర్నీ కోసం ఓపెన్ సెలక్షన్ నిర్వహించామన్నారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. సెలక్షన్స్ కి ఒక్కో జిల్లా నుంచి 4వందల మందికి పైగా ప్లేయర్స్ వచ్చారని తెలిపారు వివేక్ వెంకటస్వామి.

వెంకటస్వామి పేరుతో నిర్వహిస్తున్న టోర్నమెంట్ ను మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా అభినందించారని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ ని ఐపీల్ కి దీటుగా నిర్వహిస్తామన్నారు. ఫైనల్స్ కి బాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పి. వి. సింధు, హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులు గా వస్తున్నారన్నారు. TTL కి వ్యూయర్ షిప్ బాగా వస్తోందని.. ఇప్పటికే కోటి మందికి పైగా దీన్ని చూశారని తెలిపారు. లీగ్ సక్సెఫుల్ గా జరగడంలో… ప్రాంఛైజీ ఓనర్ లు కీ రోల్ పోషించారన్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లకి స్పాన్సర్షిప్ చేయడానికి వచ్చిన… నంది టైర్స్ అండ్ ట్యూబ్స్ వారికి, బెస్ట్  జిల్లా ప్లేయర్ కి ఒక లక్ష రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చిన ఫెనో ప్లస్ట్ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలిపారు వివేక్ వెంకట స్వామి. ఫైనల్స్ లో లేసర్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది.

https://youtu.be/wJ-vXxBmBTs

Posted in Uncategorized

Latest Updates