విమానంలో టాయిలెట్ డోర్ అనుకొని ఎగ్జిట్ డోర్ తెరవబోయాడు

ఢిల్లీ నుంచి పాట్నాకి వెళ్తుందో విమానం. ప్రయాణికులందరూ జర్నీ మూడ్ లో ఉన్నారు. అయితే ఒక్కసారిగా విమానంలో అలజడి మొదలైంది. ఓ ప్రయాణికుడు  ఫ్లైట్ ఎగ్జిట్ డోర్ తెరవబోయాడు. దీంతో పాసింజర్స్  ఒక్కసారిగా కేకలు వేశారు. ఏమవుతుందో తెలియని పరిస్థితిలో విమాన  సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆ ప్రయాణికుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఫ్లైట్ పాట్నా లో ల్యాండ్ అవ్వగానే అతడిని పోలీసులకు అప్పగించారు.

విచారణలో అతడు చెప్పిన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. తాను ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాననీ…. ప్రయాణ సమయంలో వాష్ రూంకి వెళదామనుకున్నానని.. అది వాష్ రూమ్ డోర్ అయి ఉంటుందనుకుని డోర్ ఓపెన్ చేయబోయానని చెప్పాడు. ఫ్లైట్ జర్నీ గురించి అంతగా అవగాహన లేకపోవడంతో టాయిలెట్ డోర్ అనుకొని ఎగ్జిట్ డోర్ తెరవబోయానన్నాడు. పొరపాటు జరిగింది.. క్షమించండి అని వేడుకున్నాడు. తెలియక తప్పు చేశాడని భావించిన పోలీసులు  అతడిని విడిచిపెట్టారు. అ వ్యక్తి బలవంతంగా ఎగ్జిట్ డోర్ తెరిచి ఉంటే మాత్రం.. పెను ప్రమాదం జరిగి ఉండేదని సిబ్బంది తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates