విమానంలో పేలిన పవర్ బ్యాంక్ : భయంతో వణికిపోయిన ప్రయాణికులు

vimanamచైనాలో ని ఓ డొమెస్టిక్ విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో విమానం మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరవలసి వచ్చింది. ఓవర్ హెడ్ కంపార్ట్ మెంట్ లో ఉంచిన సెల్ ఫోన్ చార్జింగ్ కు ఉపయోగించే పవర్ బ్యాంక్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగింది. చైనా సదరన్ ఎయిర్ ఫ్లైట్ ఆదివారం(ఫిబ్రవరి25) గుంగ్జుహు  నుంచి షాంగై వెళ్తున్న సమయంలో విమానం గుంగ్జుహు విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరం పవర్ బ్యాంక్ నుంచి వచ్చిన మంటలతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.  దీంతో వెంటనే విమానాన్ని నిలిపివేశారు. ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన లగేజీలో ఉన్న పవర్ బ్యాంక్ నుంచి మంటలు రావడంతో విమానంలోని అందరూ వాటిపై నీళ్లు చల్లి ఆపేందుకు ప్రయత్నించారు. కాలుతున్న ఆ పవర్ బాంక్ పై మరో ప్యాసింజర్ అయితే జ్యూస్ ని విసిరాడు మంటలను ఆర్పడానికి. కొన్ని సెకన్టలోనే వారు ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో కొందరు ప్రయాణికులు ఆ సంఘటన ఫోటోలు, వీడియోలు తీసారు. వీటిని చైనీస్ సోషల్ మీడియా వైబోలో పోస్ట్ చేయడంతో కొద్దిసేపటికే ఇతరసోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో కూడా వైరల్ అయింది. దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు మంటలకు కారణమైన ఆ ఎలక్ట్రానిక్ పవర్ బ్యాంక్ ఉపయోగంలో లేనిదని తేలిందని అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates