విమానంలో బాంబు కలకలం : 173 మంది ప్రయాణికులు సురక్షితం

fli సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ లో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. 173 మంది ప్రయాణికులతో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 థాయిలాండ్ వెళ్తున్న సమయంలో విమానంలో బాంబ్ పెట్టినట్లు సమాచారం రావడంతో విమానాన్ని సింగపూర్ చాంగీ ఎయిర్ పోర్టులో అధికారులు సేఫ్ గా ల్యాండ్ చేశారు. ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఓ వ్యక్తి బాంబు ఉన్నట్లు వదంతులు సృష్టించినట్లు గుర్తించి  అతన్ని అరెస్ట్ చేశారు. తమ పైలట్లు 24 గంటలు డ్యూటీలో ఉంటారని, ప్రతీ బెదిరింపు కాల్ నిరూపితమయ్యేంత వరకూ నిజమైనదిగా పరిగణిస్తామని సింగపూర్ రక్షణ మంత్రి ఫేస్ బుక్  ద్వారా తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates