విమానాల రాకపోకలపై ‘పెథాయ్’ ఎఫెక్ట్

‘పెథాయ్’ తుఫాను ఎఫెక్ట్ విమానాల రాకపోకలపై పడింది. తుఫాను కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దీంతో… పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ – విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. అలాగే చెన్నై- వైజాగ్ విమానం తిరిగి చెన్నైకి వెళ్లిపోయింది. అటు హైదరాబాద్- విశాఖ స్పైస్ జెట్ విమానం రద్దయింది. వైజాగ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 14 విమాన సర్వీసులను రద్దు చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులోనే సుమారు 700 మంది ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates