వియాత్నంలో వ్యాను ప్రమాదం..పెళ్లి కొడుకు సహ 14 మంది మృతి

మరికొద్ది గంటల్లో పెళ్లి చోసుకోబోయే పెళ్లి కొడుకు ప్రమాదంలో మరణించిన ఘటన సోమవారం (జూలై-30) వియాత్నంలో జరిగింది. దక్షిణ వియత్నాంలో పెండ్లి బృందంతో వెళ్తున్న వ్యాను ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. 16 సీట్ల సామర్థ్యం ఉన్న వ్యానులో పెళ్లి కొడుకు కుటుంబం పెళ్లి కూతురు ఇంటికి బయలేదేరింది. దక్షిణ వియత్నాంలోని క్వాంగ్ నామ్‌ కు సమీపంలో పెళ్లి బృదం ప్రయాణిస్తున్న వ్యాను కంటెయినర్ ట్రక్‌ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది స్పాట్‌ లోనే చనిపోగా..మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచినట్లు స్తానిక అధికారి ఒకరు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates