విరిగిపడ్డ తాజ్ ప్రవేశ ద్వారం పిల్లర్

taj pillar RAINప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్‌ మహల్‌ ప్రవేశ ద్వారంలోని పిల్లర్‌ ధ్వంసమైంది. గురువారం (ఏప్రిల్-12) కుండపోత వర్షంతో పాటు పెనుగాలుల ధాటికి కట్టడానికి దక్షిణ దిశగా ఉన్న ప్రవేశద్వారం పిల్లర్‌ కూలిందని తెలిపారు అధికారలు. చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు పలు చర్యలు చేపడుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రేమకు సంకేతంగా 17వ శతాబ్ధంలో నిర్మించిన ఈ చారిత్రక కట్టడానికి పర్యాటకులు పోటెత్తుతుండటం, వాహన కాలుష్యం పెరుగుతున్న క్రమంలో తాజ్‌ మహల్‌లోకి వీక్షకులను రోజుకు మూడు గంటలు మాత్రమే అధికారులు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే

Posted in Uncategorized

Latest Updates