వివాహితపై కత్తితో దాడిచేసి తానూ పొడుచుకున్న యువకుడు

కరీంనగర్ : కరీంనగర్ శివారులో దారుణం జరిగింది. తిమ్మాపూర్ మండలం అల్గునూరు తమిళకాలనీలో  యువకుడు రాజేశ్.. స్థానికంగా ఉంటున్న మహిళపై బ్లేడ్ లాంటి కత్తితో దాడిచేశాడు. ఆమె మెడ, భుజాలపై కోతలు పెట్టాడు. ఆ తర్వాత తానుకూడా ఇష్టమొచ్చినట్టుగా గాట్లు పెట్టుకుని.. కడుపులో కత్తితో పొడుచుకున్నాడు. ఈ ఇద్దరినీ కరీంనగర్ లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయారు బంధువులు. యువతికి ప్రాణాపాయం తప్పింది. తీవ్రగాయాలతో రాజేశ్ చికిత్స పొందుతున్నాడు.

ఈ ఇద్దరూ బంధువులే. బాధితురాలికి పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడు. యువకుడు పాత పరిచయాన్ని కొనసాగించాలంటూ వేధించినట్టు బంధువుల ద్వారా తెలిసింది. దీనికి ఒప్పుకోకపోవడంతో… సైకోగా మారి కత్తితో దాడిచేసినట్టు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates