వివాహేతర సంబంధం కేసు : నాడు తండ్రి సమర్ధిస్తే…ఇవాళ కొడుకు ఖండించాడు


అడల్ట్రీ చట్టం రాజ్యాంగ విరుద్దమంటూ ఇవాళ(సెప్టెంబర్-27) సుప్రీం చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు సమయంలో ఓ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముప్పై మూడేళ్ల క్రితం తండ్రి సమర్థించిన చట్టాన్నే ఈ రోజు కొడుకు తప్పుబట్టారు. వాళ్లే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌‌, ఆయన తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌‌.

వివాహేతర సంబంధం నేరం కాదంటూ ఇవాళ ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ ఐదుగురు సభ్యులలో జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. అయితే 33 ఏళ్ల క్రితం… అడల్ట్రీ చట్టాం రాజ్యాంగ బద్దంగానే ఉందంటూ సెక్షన్‌ 497 పై చంద్రచూడ్‌‌ తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌‌ తీర్పు చెప్పారు. వివాహేతర సంబంధాల్లో…. కొంత వరకైనా చట్ట ప్రకారం శిక్షలు ఉండటం సమాజానికి అవసరమని అప్పట్లో తెలిపారు. అయితే డీవై చంద్రచూడ్‌‌ తన తండ్రి అభిప్రాయాన్ని ఖండించడం ఇది రెండో సారి. గతంలో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కేసులో కూడా ఇలాగే జరిగింది.

Posted in Uncategorized

Latest Updates