వివాహేతర సంబంధం నేరం కాదు: సుప్రీం చారిత్రాత్మక తీర్పు

150 ఏళ్ల నాటి అడల్ట్రీ చట్టం సమానత్వం, జీవించే హక్కుకు వ్యతిరేకంగా ఉందని సుప్రీం తెలిపింది. ఇష్టపూర్వకంగా కొనసాగే వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమంటూ ఇవాళ(సెప్టెంబర్-27) సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్దం అంటూ సుప్రీం సృష్టం చేసింది. మహిళలను తోటి మనుషులుగా కాకుండా వస్తువులుగా పరిగణిస్తున్నారని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది. ఒకరు ఎవరితో శృంగారం చేయాలి.. ఎవరితో చేయకూడదు అనే విషయాన్ని మరో వ్యక్తి నిర్ణయించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. భర్తే యజయాని అన్న భావజాలానికి చరమగీతం పాడాల్సిన సమయమొచ్చిందని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా అన్నారు. వివాహమైతే పురుషులు భార్యలను తమ ఆస్తిగా భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే వివాహేతర సంబంధాల కారణంతో విడాకులు తీసుకోవచ్చని, దాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టంచేసింది.

అడల్ట్రీ చట్టం ఏకపక్షంగా ఉందంటూ IPC సెక్షన్ 497 ను ఛాలెంజ్ చేస్తూ కేరళకు చెందిన జోసెఫ్ షైన్ అనే వ్యాపారవేత్త సుప్రీంకోర్టులో 2017 లో పిల్ వేశాడు. దీన్ని వాచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసం  అడల్ట్రీ చట్టం రాజ్యాంగ విరుద్దంగా ఉందని, అడల్ట్రీ చట్టాన్ని రద్దు చేస్తూ చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది.
సుప్రీం తీర్పుని నేషనల్ కమీషన్ ఆఫ్ ఉమెన్ చీఫ్ రేఖా శర్మ స్వాగతించారు. ఎప్పడో అడల్ట్రీ చట్టాన్ని రద్దు చేయాల్సిందని, ఇన్నాళ్లకి సమానత్వపు హక్కు మహిళలకు అభించిందని ఆమె తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates