వివిఫై దూకుడు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఫిన్‌ టెక్‌‌‌‌ ఎన్‌ బీఎఫ్‌ సీ అయిన వివిఫై ఇండియా కార్యకలాపాల్ లో దూసుకుపోతోం ది. ఈ కంపెనీ గతేడాది
లాంచ్‌ చేసిన ‘ఫ్లెక్స్‌‌‌‌శాలరీ’ సర్వీసు అకౌంట్లు 20 వేలను దాటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలు, పట్టణాల నుంచి ‘ఫ్లె-
క్స్‌‌‌‌శాలరీ’ కోసం దరఖాస్తు చేసుకుంటు న్నారని కంపెనీ పేర్కొం ది. ‘ఫ్లెక్స్‌‌‌‌శాలరీ’ కింద,ఎవరికైతే వెం టనే రుణం లభించడానికి
కష్టం అవుతుందో , వారికి ఎమర్జెన్సీ లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌‌‌‌ను ఆఫర్‌‌‌‌ చేస్తోంది వివిఫై ఇండియా.2017 ఆగస్టులో ‘ఫ్లెక్స్‌‌‌‌శాలరీ’ని వివిఫై ఇండియా లాం చ్‌ చేసిం ది.1,50,000కు పైగా యాప్‌ డౌన్‌ లోడ్స్‌‌‌‌తో 20వేలకు పైగా ‘ఫ్లెక్స్‌‌‌‌శాలరీ’ అకౌంట్లను అప్రూవ్‌ చేసినట్టు వివిఫై ఇండియా ఫైనాన్స్‌‌‌‌ వ్యవస్థాపకులు, సీఈవో అనిల్‌ పినపాల తెలిపారు .www.FLEXSALARY.com అకౌంట్‌‌‌‌కు వెబ్‌ ట్రాఫిక్‌‌‌‌ దాదాపు 3 లక్షలు ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. తొలుత తెలంగాణ నుం చే దీనికి వెబ్‌ ట్రాఫిక్‌‌‌‌ లేదా ఎంక్వెయిరీస్‌ ఉండేవని, కానీ ప్రస్తుతం లోన్‌ అప్లికేషన్లు, వెబ్‌ ట్రాఫిక్‌‌‌‌ దేశవ్యాప్తంగా ఉన్న 15 నగరాల నుంచి వస్తున్నాయని వివిఫై ఇండియా తెలిపింది. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌, బెం గళూరు, చెన్నై, పుణే, ముం బై,ఎన్‌ సీ ఆర్‌‌‌‌ ప్రాంతాల నుంచి ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని పేర్కొం ది. ఈ జాబితాలో హైదరాబాద్‌‌‌‌ టాప్‌ లో ఉంది. వివిఫై ఇండియా నాన్‌ ప్రైమ్‌ కస్టమర్లకు క్రెడిట్‌‌‌‌ను అందజేస్తోంది. నాన్‌ ప్రైమ్‌ కస్టమర్లకు క్రెడిట్‌‌‌‌ హిస్టరీ, ఆదాయం తక్కువగా ఉండటంతో, రుణం లభించడం కష్టంగా ఉంటుంది.

Latest Updates