విశాక ఇండస్ట్రీస్ సోలార్ ప్యానెల్ ఫ్యాక్టరీ ప్రారంభం

IT minister1విశాక ఇండస్ట్రీస్ కొత్తగా ఆటమ్ సోలార్ ప్యానెల్ ఫ్యాక్టరీ ప్రారంభించింది. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామం దగ్గరున్న విశాక ఇండస్ట్రీస్ లో ఈ వింగ్ ను మంత్రి కేటీఆర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఫ్యాక్టరీ మొత్తాన్ని కలియతిరిగి చూశారు. తయారీ విధానం, ఎలా పని చేస్తుంది అనే విషయాలను అడిగి మరీ తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి ఇన్నోవేటివ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం నుంచి రావటం గర్వంగా ఉందన్నారు మంత్రి. రూఫ్ విత్ సోలార్ ప్యానెల్స్ ఉండటం వీటి ప్రత్యేక అన్నారు విశాక ఇండస్ట్రీ JMD వంశీ. ఇలాంటి యూనిట్ దేశంలో మొదటిది ఇదే అన్నారు. సోలార్ కాంపోనెంట్స్ తో రూఫ్ తయారీ అనేది దేశంలోనే మొదటిది అన్నారు.

ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, మాజీమంత్రి వినోద్, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు  హాజరయ్యారు.

Posted in Uncategorized

Latest Updates