విశాఖలో మావోయిస్టుల కాల్పులు..అరకు ఎమ్మెల్యే మృతి

వైజాగ్ : అరకులోయలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ప్రభుత్వ విప్‌, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఇవాళ మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే శివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు.

డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి  కూడా గాయాలైనట్టు సమాచారం. కిడారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిడారిపై దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ నిర్ధారించారు. మావోయిస్టులు హిట్‌ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. ఈ దాడిలో 50మంది మహిళ మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. దాడి అనంతరం మావోయిస్టులు ఎటువెళ్లారనే దానిపై పోలీసులు గాలింపు చేపట్టారు.

 

Posted in Uncategorized

Latest Updates