విశాఖ తీరంలో అలరిస్తున్న విదేశీ పువ్వులు

VAఒక దేశంలో..అక్కడి వాతావరణ పరిస్థితుల్లో పెరిగే మొక్కలను మరో దేశంలో పెంచాలంటే చాలా కష్టమే. అలాంటి అరుదైన పుష్పాలను ఇచ్చే  మొక్కలను పెంచాలనే కోరికతో విశాఖలో ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం విజయవంతమైంది. దీంతో సముద్రతీరంలో విదేశీ పువ్వులు రంగు రంగులతో అలరిస్తున్నాయి.

పెటూన్యాస్ ఫ్లవర్స్ యూరప్ వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి. వీటిని ఇండియాలో పెంచాలంటే అక్కడి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఉష్ణోగ్రత ఎప్పుడూ 24 డిగ్రీలకు  మించకూడదు. అందులోనూ నవంబర్ నుంచి ఫిబ్రవరి నెల మధ్యలోనే ఈ పుష్పాలు పెరుగుతాయి. ఆ మొక్కలపై ఇష్టంతో మొక్కలని జర్మనీ నుంచి తీసుకుని వచ్చి…ఇక్కడ ఆ పరిస్థితులను కల్పించాడు విశాఖలోని సన్ రైజ్ రిసార్ట్స్ యాజమాని. దీంతో పెటూన్యాస్ పువ్వులు విశాఖలో విరగబూస్తున్నాయి. జర్మనీ, రష్యా, సింగపూర్, థాయ్ లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో మాత్రమే దొరికే  ఈ తరహా పూలు.. విశాఖలో అందుబాటులో ఉండడంతో వాటిని చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు జనం.

కోల్డ్ కంట్రీస్ కే పరిమితమైన ఈ పూల మొక్కలను ఇక్కడ పెంచేందుకు తాను ఎంతో కష్టపడ్డానన్నారు సన్ రైజ్ రిసార్ట్ యజమాని రాజబాబు. జర్మనీ నుంచి బ్రీడ్ తీసుకుని వచ్చి…ఇక్కడ పెంచడం ఖర్చుతో కూడుకున్న పనైనా…. మొక్కలంటే ఇష్టంతోనే చేశానన్నారు. విదేశి పువ్వులతో విశాఖ సాగర తీరానికి సరికొత్త అందం వచ్చింది.

Posted in Uncategorized

Latest Updates