విశాల్ తో పెళ్లిపై…క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్

హీరో విశాల్‌, నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తమ పెళ్లిపై వస్తున్న వార్తలపై వరలక్ష్మీ క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్‌పైనే ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపింది.
నేను పెళ్లి చేసుకోబోతున్నానని సినిమా ఇండస్ట్రీలో రూమర్లు వస్తున్నాయి. నాకు నిశ్చితార్థం జరగలేదు.. నేను పెళ్లి చేసుకోవడం లేదు. నన్ను కిందకి లాగటానికి ఇలాంటి బేస్ లెస్ రూమర్లు ప్రచారం చేస్తోన్న జాబ్ లెస్ పీపుల్ కి ధన్యవాదాలు. నేను ఇక్కడ కేవలం పనిచేయడానికి, నటించడానికి ఉన్నాను. నా కష్టం ఎప్పటికీ వృద్దా కాదు అంటూ లవ్‌ మైజాబ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను వరలక్ష్మి జత చేశారు.
ప్రస్తుతం వరలక్ష్మి ప్రతినాయకురాలిగా ‘పందెంకోడి 2’ అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్‌ హీరోగా నటిస్తున్న ‘సర్కార్‌’లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘మారి 2’,తదితర సినిమాల్లో వరలక్ష్మి నటిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates