విశాల్.. రియల్ లైఫ్ కూడా హీరోనే

vishalరీల్ లైఫ్ లోనే కాదు…రియల్ లైఫ్ లో కూడా  హీరో అన్పించుకున్నాడు హీరో విశాల్. నుటుడిగా, నిర్మాతగా, నడిగర్‌ సంఘం కార్యదర్శిగా, సామాజిక కార్యకర్తగా ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిని చాటుకున్నాడు. విశాల్‌ హీరోగా గత వారం రిలీజైన అభిమన్యుడు సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. విశాల్‌ గత సినిమాలకు లేనంతగా ఈ సినిమా రికార్డ్‌ కలెక్షన్లు సాధిస్తోంది. మొదటి వారాంతానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12కోట్లు కొల్లగొట్టింది. రెండో వారంలో కూడా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది.

అయితే తాజాగా విశాల్‌ ఓ నిర్ణయాన్ని ప్రకటించి రియల్‌ హీరో అనిపించుకున్నారు. సినిమా సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు పంచాలని విశాల్ నిర్ణయించారు. టికెట్‌పై ఒక్కొ రూపాయి చొప్పున రైతులకు అందివ్వనున్నట్లు ప్రకటించారు. గతంలో విశాలో తమిళనాట కూడా ఇదే విధంగా ప్రకటించి రైతులకు తన వంతు సహాయాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడ తన సినిమా లాభాల్లో వాటా ఇవ్వబోతున్నానని ప్రకటించడంతో విశాల్‌కు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates