విశ్వాసం అంటే మాదే : ఇంటర్నెట్ హీరో పోలీస్ డాగే

dogవిశ్వాశానికి మేమే ప్రతీక అంటూ ఓ కుక్క చేసిన పని ఇప్పుడు అందరి ప్రశంశలందుకొంటుంది. ఇప్పుడు ఆ కుక్క ఇంటర్నెట్ హీరోగా మారిపోయింది. ప్రాణాపాయస్ధితిలో ఉన్న తన ట్రైనర్ ను కాపాడేందుకు కుక్క చేసిన పని వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. స్పెయిన్ సెంట్రల్ రాజధాని మాడ్రిడ్ లో జరిగిన ఈ ఘటన వీడియోను మాడ్రిడ్ పోలీసులు శుక్రవారం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ 20 లక్షల మంది ఆ వీడియోను చూశారు.

ఓ పోలీస్ అధికారి(k-9 ట్రైనర్) ట్రైనింగ్ ఎక్సర్ సైజ్ పమయంలో సృహ కోల్పోయి గ్రౌంగ్ లో పడిపోయినట్లు నటించాడు.  వెంటనే  పోంచో అనే పోలీస్ కుక్క రంగంలోకి దిగింది.  అతడ్ని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసింది. అచ్చం మనిషిలాగే ఆయన గుండెపై ఒత్తిడి పెంచేందుకు పైకి కిందకు దూకుతూ.. మద్య మధ్యలో శ్వాస తీసుకుంటున్నారో లేదో తెలుసుకునేందుకు ఆతని ముఖంపై తల పెట్టి గమనించింది. చివరకు ఆ  అధికారి లేచి కూర్చోవడంతో ఆ కుక్క నందానికి అవధుల్లేకుండా పోయాయి.

Posted in Uncategorized

Latest Updates