విషాదంలో జనసేనాని : పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరి మృతి

Pawan-kalyan-flexజనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాష్ట్రం ఉత్తరాంధ్రలో పోరాట యాత్ర చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జూన్ 6వ తేదీ ఆయన విశాఖ జిల్లా పాయకరావుపేటలో పర్యటిస్తున్నారు. ఈ సాయంత్రం ర్యాలీ, బహిరంగ సభ ఉంది. జనసేనానికి ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు, నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. పాయకరావుపేటలో పెద్ద ఎత్తున జనసేన జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేశారు. ఈ క్రమలోనే.. పాయకరావుపేటలోని సాయిమహల్ జంక్షన్ దగ్గర.. పవన్ కల్యాణ్ కు స్వాగతం పలుకుతూ పాయకరావుపేటకు చెందిన శివ, తునికి చెందిన తోళెం నాగరాజు ఓ ఇంటి పైకప్పు దగ్గర.. నిచ్చెన ఎక్కి ఫ్లెక్సీ కట్టేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న కరెంట్ వైర్లు తగిలి ఇద్దరు షాక్ తో చనిపోయారు.

ఇద్దరు అభిమానులు ప్రమాదంలో చనిపోయారు అని తెలిసి పవన్ కల్యాణ్ షాక్ అయ్యారు. విషాదంలోకి వెళ్లిపోయారు. వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అభిమానులు, ఫ్యాన్స్ జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే చెబుతున్నానని.. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలని సూచించారు. అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.

Posted in Uncategorized

Latest Updates