విహారయాత్రకు వెళ్తూ..నలుగురు ప్రాణ స్నేహితులు మృతి

FRIEND DEATHవాళ్లంతా చిన్ననాటి ప్రాణ స్నేహితులు. మూడు రోజులు టూర్ కి వెళ్లి, ఎంజాయ్ గా గడుపుదామనుకున్నారు. కానీ ఇంతలోనే విధి ఎక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణ స్నేహితులు మరణించారు. చిన్నప్పట్నుంచి కలిసిమెలిసి తిరిగే ఆ నలుగురు కలిసే చనిపోయిన ఈ యదర్ధ సంఘటన శుక్రవారం (మే-18) జీడిమెట్లలో జరిగింది. వివరాల్లోకెళితే.. శుక్రవారం తెల్లవారుజామున 2:40 గంటలకు వికారాబాద్‌ వెళ్లేందుకు సాయిబాబానగర్‌ నుండి బాలానగర్‌ వైపు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జీడిమెట్ల డిపో సమీపంలోని డీపీ కాలనీ వద్ద గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చి డివైడర్‌ ను ఢీకొట్టింది. ఐదు మీటర్ల ఎత్తున గాల్లోకి ఎగిరిన కారు రోడ్డుపై రెండు పల్టీలు కొట్టి 100 మీటర్ల దూరం వరకూ దూసుకెళ్లి చెట్టుకు ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న రామారావు, పక్కసీట్లో కూర్చున్న ఉదయ్‌కిరణ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన హేమసుందర్, గణేష్, కిరణ్‌లను స్థానికులు 108లో సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. హేమసుందర్, గణేష్‌ చికిత్స పొందుతూ కన్నుమూయగా.. కిరణ్‌ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కారు వెనక సీట్లో కూర్చున్న కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు డాక్టర్లు. రోడ్డు ప్రమాదంలో ఒకేసారి నలుగురు యువకులు మృతిచెందడంతో సాయిబాబానగర్‌ లో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరంతా 19 ఏళ్ల లోపు వారే.. అందివచ్చిన కొడుకులు చేదోడు వాదోడుగా నిలుస్తారన్న ఆ తల్లిదండ్రుల కలలు రోడ్డు ప్రమాదం రూపంలో ఆవిరైపోయాయి.

Posted in Uncategorized

Latest Updates