వీడికేం పోయేకాలం : కన్నబిడ్డలు, భార్యను చంపేశాడు

murder 5హైదరాబాద్ సిటీలో మరో దారుణం. భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడు. జిల్లెలగూడ సుమిత్ర ఎంక్లేవ్ లో ఈ ఘటన జరిగింది. హరీందర్ అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య జ్యోతి (33), కుమారుడు అభితేజ్ (6), కూతురు సహస్ర (4) ఉన్నారు. ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం రాత్రి భార్య, పిల్లలను చంపేశాడు. ఈ తర్వాత మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో తనే స్వయంగా లొంగిపోయాడు. హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబంలోని గొడవలే హత్యకు కారణం అని చెబుతున్నాడు. కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. హత్య జరిగే స్థాయిలో అవి లేవని అంటున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates