వీడిన నరబలి మిస్టరీ..పోలీసులను నిందితుడు బాగా ఇబ్బంది పెట్టాడు

CHILKAహైదరాబాద్ ఉప్పల్ చిలుకానగర్ లో శిశువు నరబలి కేసును ఛేదించారు పోలీసులు. DNA రిపోర్టు ఆధారంగా గురువారం (ఫిబ్రవరి-15) ఇంటి ఓనర్ చంద్రశేఖర్ నిందుతుడుగా తేల్చారు పోలీసులు.  రాజశేఖర్ ఇంట్లో  దొరికిన బ్లడ్ శాంపిల్ తో పాటు ఇంటిపై లభించిన చిన్నారి తల బ్లడ్ శాంపిల్.. ఒక్కటే అని ఫోరెన్సిక్ రిపోర్టు రావడంతో.. రాజశేఖర్ ను నిందితుడిగా తేల్చారు.  చిలుకా నగర్‌లోని చిన్నారి నరబలి కేసు విచారణ ఫైనల్ కి చేరింది.

ఈ కేసుకు సంబంధించి నిందితులను గురువారం సాయంత్రం మీడియాముందు ప్రవేశపెట్టారు సీపీ మహేష్ భగవత్.  చంద్రగ్రహాణం జరిగినప్పట్నుంచి విచారిస్తున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి వివరాలు తెలియరాలేదని.. ఈ పది రోజుల విచారణలో బ్లడ్ షాంపిల్స్ లో వచ్చిన రిసల్ట్ ఆధారంగా..  ఇంట్లో దొరికిన బ్లడ్ షాంపిల్స్ మరణించిన చిన్నారి తల బ్లడ్ సేమ్ అని తేలండంతో.. ఇంటి ఓనర్ రాజశేషరే ప్రధాన నిందుతుడిగా తేల్చామన్నారు సీపీ మహేష్ భగవత్.  క్యాబ్‌ డ్రైవర్‌ రాజశేఖర్‌ ఇంటిపై లభించిన తల, అతడి ఇంట్లో లభించిన రక్తపు మరకలు ఆడ శిశువువిగా ఫోరెన్సిక్‌ రిపోర్టులో తేలిందన్నారు. మూఢ నమ్మకాల నెపంతో చిన్నారిని బలి ఇచ్చినట్లు నిర్ధారణలో తేలిందన్నారు.  ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను పడేసినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించినట్లు చెప్పారు.

బలి ఇచ్చిన చిన్నారిని బోయగూడలోని ఫుట్‌పాత్‌ వద్ద నిద్రిస్తున్న వారి దగ్గర  నుంచి చిన్నారిని ఎత్తుకొచ్చినట్లు చెప్పిన పోలీసులు..  ఈ కేసులో క్యాబ్‌ డ్రైవర్‌ రాజశేఖర్‌, అతని భార్య శ్రీలత, బంధువులు  నలుగురు మాంత్రికులను  అరెస్ట్‌ చేశామన్నారు. నరబలి తర్వాత పాప తలపై చంద్రుని వెలుగు, సూర్య కిరణాలు పడాలని చెప్పడంతో డాబాపై తల పెట్టినట్లు నిందితుడు చెప్పాడని చెప్పారు సీపీ. నరబలి కేసులో బోయగూడకు చెందిన రాజశేఖర్‌ సోదరుడు గణేశ్‌ కీలకంగా వ్యవహారించాడని.. గణేశ్‌ చార్మినార్‌లోని ఒక బాబా కన్నుసన్నల్లో పూజలు చేయించాడన్నారు. బోయగూడలోని ఓ ఫుట్‌ పాత్‌ నుంచి నరబలి కోసం చిన్నారిని ఎత్తుకొచ్చాడని తెలిపిన ఆయన.. నరబలి తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను సోదరులు ఇద్దరు బండ్లగూడ మూసి సమీపంలో చెట్ల పొదలో పడేశారన్నారు.

పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకకుండా ముందు జాగ్రత్త పడ్డారని.. వీరిద్దరికి కన్నతల్లి అన్ని విధాలా సహకరించిందన్నారు. తనకు ఏమి తెలియనట్లు రాజశేఖర్‌ తల్లి పోలీసుల దగ్గర నమించే ప్రయత్నం చేసిందన్నారు. కేసు దర్యాప్తులో మృతి చెందిన చిన్నారిని తల్లి గుర్తించడమే కాకుండా.. గణేశ్‌ అపహరించినట్లు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల దృష్టి మరల్చేందుకు అర్ధరాత్రి సమయంలో గణేశ్ నరహరి ఇంటిలోకి ప్రవేశించినట్లు తెలిపారు సీపీ. ఈ కేసు కోసం 140 ఫోన్ల్ ట్రాపింగ్ చేశామని, 40 మంది అనుమానితులను విచారించామన్నారు.

జనవరి-31 నుంచి నిందితుడు ఏం చేశాడని పూర్తిగా తమ పోలీసులు విచారించారన్నారు. ముందునుంచి అనుకున్నట్లుగానే ఇంటి ఓనర్ రాజశేఖరే నిందితుడిగా తేలిందన్నారు. విచారణలో రాజశేఖర్ పోలీసులను తీవ్రంగా ఇబ్బందికి గురి చేశాడన్నారు. ఒక్కోసారి రాజశేఖర్ చెప్పేదే నిజామా అనే విధంగా నటించాడన్నారు. మొత్తంమీద 10 రోజుల కష్టానికి DNA తో అసలు విషయం బయటపడిందన్న సీపీ మహేష్ భగవత్.. నిందితులపై  సెక్షన్ 124 , 302, 366, 201, 120 B కింద కేస్ నమోదు చేసినట్లు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates