వీడి అఘాయిత్యం పాడుగాను : సలహా ఇవ్వటం కోసం ATM తగలెట్టాడు

atm-fireఏదో చేయాలనే తాపత్రయం.. అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఆవేశం ఉన్నా.. ఏమీ చేయలేని నిస్సాహాయతలో ఉన్నాడు. ప్రపంచాన్ని మార్చాలనే తాపత్రయం.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. ఎలా చేయాలో అర్థం కాక.. తన సందేశాన్ని ప్రచంచానికి ఓ క్రైం యాంగిల్ లో తీసుకెళ్లాడు. బ్యాంక్ ATM తగలపెట్టాడు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ సిటీ కూకట్ పల్లి KPHB కాలనీలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ATM ఉంది. గుర్తు తెలియని వ్యక్తి మిషన్ ను తగలబెట్టాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఏటీఎంలో నుంచి మంటలు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఫైర్ సిబ్బంది కూడా స్పాట్ కు వచ్చింది. మంటలు ఆర్పారు. ATM సెంటర్ లో ఓ 17 పేజీల లేఖ ఉంది. ప్రపంచంలో మానవ సంబంధాలు, సమస్యలు మాయం అవుతున్నాయని.. మానవ సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ సూచనలు పాటించాలని కోరుతూ నోట్ పెట్టాడు. నెత్తిన టోపీ, ముఖానికి కర్ఛీప్ కట్టుకుని ఉన్నాడు ఆ వ్యక్తి. ఏటీఎం తగలపెట్టటం కలకలం రేపుతోంది.

ఈ పని ఎవరు చేశారు అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్నారు. అతన్ని త్వరగా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. లేఖను పరిశీలిస్తే అతని మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులు అంటున్నారు. ఏటీఎంలోని రూ.70వేలు సేఫ్ గానే ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates