వీడు కెవ్వుకేక డ్రైవర్ : ముందుకే.. రివర్స్ లో వెళతాడు

carఏందీ టైటిల్ చూసి తికమకగా ఉన్నారా.. ముందుకు వెళ్లటం ఏంటీ.. అందులోనూ రివర్స్ లో ఏంటీ అనుకుంటున్నారా.. వీడియో చూసే వరకు అందరూ అలాగే అంటారు.. వీడియో చూసిన తర్వాత వీడు కెవ్వుకేక డ్రైవర్ అంటూ నవ్వుకోలేకుండా ఉండలేరు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హల్ చల్ చేసేస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..

అమెరికాలోని ఓహియో రాష్ట్రం. పెద్ద పట్టణం. రహదారులు రద్దీగానే ఉంటాయి. వెహికల్స్ స్పీడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి రోడ్డులో ఓ వ్యాన్ డ్రైవర్ తన డ్రైవింగ్ ప్రతిభ చూపించాడు. రివర్స్ లో 1.5 మైల్స్ ప్రయాణించాడు. ముందుకు ఎలా అయితే స్పీడ్ డ్రైవింగ్ చేస్తామో.. అదే విధంగా ఏ మాత్రం లైన్ క్రాస్ చేయకుండా రివర్స్ లో ప్రయాణించాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. జూన్ 6వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో ఇది జరిగింది. అది ఓ క్రాస్ రోడ్డు జంక్షన్. ముందుకే.. రివర్స్ లో డ్రైవ్ చేస్తూ వెళ్లాడు. ఈ వ్యాన్ వెనక వచ్చే వారికి ముందు భాగం కనిపిస్తోంది.. ముందు వెళ్లే వారికి ఈ వ్యాన్ వెనక భాగం కనిపిస్తోంది. దీంతో ఈ వెహికల్ ముందూ వెనక ఉన్న వాహనదారులు కొద్దిసేపు తికమక పడ్డారు. వీడెవడండీ బాబూ రివర్స్ లో దూసుకొస్తున్నాడు అని కన్ఫ్యూజ్ అయ్యారు. ఇలా ఎందుకు డ్రైవింగ్ చేస్తున్నాడో అర్థం కాక అయోమయానికి గురయ్యారు మిగతా వాహనదారులు. ఇక్కడ విశేషం ఏంటంటే.. రెండు కిలోమీటర్లు ఈ విధంగా డ్రైవింగ్ చేసినా ఎక్కడా రూల్స్ బ్రేక్ చేయలేదు.. సిగ్నల్ జంప్ కాలేదు.. లైన్ క్రాస్ కాలేదు.. యాక్సిడెంట్ చేయలేదు.

ఈ సీసీ కెమెరా వీడియోను ఓహియో డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్ తన ఫేస్ బుక్ లో అధికారికంగా పోస్ట్ చేసింది. అలా పోస్ట్ పెట్టిన వెంటనే వాల్డ్ వైడ్ వైరల్ అయిపోయింది. ఈ డ్రైవర్ లా ఎవరూ చేయొద్దు అని కోరింది. కిక్కు కోసం ఇలా చేశాడో లేక వెహికల్ లో లోపం ఉండి ఇలా జరిగిందో తెలియదని ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. రివర్స్ లో ఇంత పర్ ఫెక్ట్ గా నడిపిన డ్రైవర్ టాలెంట్ ను మాత్రం నెటిజన్లు శెభాష్ అంటున్నారు.

Don't Be This Driver – Reverse

Pro tip, if your vehicle isn't running properly, pull safely to the side of the road and call for assistance. Thankfully, no one was injured in this incident.

Ohio Department of Transportation 发布于 2018年6月5日周二

Posted in Uncategorized

Latest Updates