వీడు మనిషేనా : ఇద్దరు బామ్మలను నరికి చంపాడు

వికారాబాద్ : బామ్మతో సరదాగా గడపాల్సిన ఓ మనవడు దారుణంగా ప్రవర్తించాడు. విసిగిస్తుందని క్షణికావేశంలో చంపేశాడు. అడ్డువచ్చిన మరో నానమ్మను నరికేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.

పూడూరు మండలం చన్ గోముల్ గ్రామానికి చెందిన శివకుమార్ మంగళవారం డిసెంబర్-11న తెల్లవారుజామున తన సొంత నానమ్మ బుచ్చమ్మను కొడవలితో నరికి చంపాడు. ఆ తర్వాత చిన్న తాతయ్య భార్య అంతమ్మపై అదే కోడవలితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఉన్న అంతమ్మను వికారాబాద్ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు డాక్టర్లు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శివకుమార్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకేసారి ఒకే ఫ్యామిలీకి చెందినవారు చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు బంధువులు.

Posted in Uncategorized

Latest Updates