వీడు మెంటల్ పని చేశాడు : యాక్సిడెంట్ జరిగితే.. సెల్ఫీలు తీసుకుంటూనే ఉన్నారు

రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తాం.. వెంటనే పరిగెత్తుకు వెళ్తాం.. కాపాడటానికి ప్రయత్నిస్తాం.. ఓ అంబులెన్స్ వస్తుంటే ఏం చేస్తాం.. దారి ఇస్తాం.. పక్కన ఆగుతాం.. దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని ఏం అంటాం.. మేం చెప్పేది లేదుకానీ.. నెటిజన్లు మాత్రం మెంటల్ గాళ్లు, వేస్ట్ గాళ్లు.. అసలు వీళ్లు మనుషులే కాదు అంటున్నారు. అచ్చం ఇలాగే జరిగింది రాజస్థాన్ రాష్ట్రంలో. బర్మీర్ జిల్లా జైసల్మీర్ రహదారిపై జూలై 10వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. ఓ స్కూల్ బస్సు.. బైక్ ను ఢీకొట్టింది. ఆ బైక్ పై పరమానంద్ (27), జీమారం(30), చంద్రం (30) ఉన్నారు.

స్కూల్ బస్సు వేగంగా ఢీకొనటంతో బైక్ పై ఉన్న ఈ ముగ్గురు ఎగిరి రోడ్డపై పడ్డారు. అందులో పరమానంద్ స్పాట్ లోనే చనిపోయాడు. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అక్కడికి వచ్చిన స్థానికులు, రోడ్డపై వెళుతున్న వారు యాక్సిడెంట్ దగ్గర ఆగారు. అయినా కూడా ఎవరూ స్పందించలేదు. కొందరు అయితే సెల్ఫీలు దిగారు. మరికొందరు సినిమా చూస్తున్నట్లు చూశారు. ఇద్దరు కుర్రోళ్లు రోడ్డుపై రక్తపు మడుగులో పడి ప్రాణాలతో కొట్టమిట్టాడుతుంటే సెల్ఫీలు దిగటానికి ప్రయత్నించారు. కనీసం 30 నిమిషాల వరకు ఎవరూ కూడా కాపాడాలనే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత ఓ వ్యక్తి స్పందించి పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. యాక్సిడెంట్ స్పాట్ లో కాపాడకుండా ఫొటోలు, వీడియోలు తీసుకుని వాటిని సగర్వంగా సోషల్ మీడియాలో అప్ లోడ్ కూడా చేశాడు. అలా దిగిన ఓ ఫొటోలే ఇవి.

పరమానంద్ ఘటనా స్థలంలోనే చనిపోగా.. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. సకాలంలో వైద్యం అందకపోవటం వల్లే చనిపోయారని డాక్టర్లు చెప్పారు. కేవలం ఇది అక్కడి వారి నిర్లక్ష్యమే.. యాక్సిడెంట్ స్పాట్ లో వారిని రక్షించకుండా స్పాట్ నుంచి సెల్ఫీలు దిగటం, వీడియోలు తీయటం ఏంటో అర్థం కావటం లేదు.. వారి మైండ్ ఏ విధంగా పని చేస్తుందో కూడా అర్థం కావటం లేదంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.

Posted in Uncategorized

Latest Updates