వీడు.. వీడి కిక్కు పాడుగాను : ఆర్మీ ఆయుధాల ట్రక్కుతో చక్కర్లు కొట్టాడు

Army-Vechileకిక్కు సినిమాలో కిక్కు కొసం హీరో ఎన్ని వింతపనులు చేస్తుంటాడో మనం చూశాం. అయితే అలాగే కిక్కు కావాలని ఓ సైనికుడు చేసిన పని ఆ దేశ పోలీసులు, ప్రజలకు కొంత సమయంపాటు గుండెళ్లో రైళ్లు పరుగెత్తించింది. పోలీసులకు చెమటలు కక్కినంత పనైంది.

వర్జీనియాకు చెందిన జోషువా ఫిలిప్ యబూట్(29) అనే యువ సైనికుడు మంగళవారం(జూన్-5) ఆయుధాలతో నిండి ఉన్న ఓ మిలటరీ వాహనాన్నే దొంగిలించాడు. సినిమాల్లో ఉండే చేజింగ్ సీన్స్ ని తలదన్నేలా రెండు గంటలపాటు 120 కిలోమీటర్లు చేజ్ చేసి చివరికి అతడ్ని పట్టుకున్నారు పోలీసులు. ఫోర్ట్ ఫికెట్ దగ్గర నిందితుడు ఆర్మీ వెహికల్ ను దొంగలించాడని, రెండు గంటలు చేజ్ చేసి చివరకు రిచ్ మండ్ సిటీ హాల్ దగ్గర అతడ్ని అరెస్ట్ చేసినట్లు వర్జీనియా పోలీసులు తెలిపారు.

పోలీసులు ఎంత అలర్ట్ గా ఉన్నారో, ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారో ఓ ట్రైల్ వేద్దామనే తాను అలా చేశానని నిందితుడు తెలిపాడు. ఒక సీనియర్ బ్రిగేడ్ కమాండరే తనకు అలా చేయమని చెప్పినట్లు తెలిపాడు. అయితే యబూట్ ఆయుధాల వాహనాన్ని తీసుకెళ్లడంతో… ఎక్కడ  ఆయుధాలతో దేశ ప్రజలపై దాడి చేస్తాడో అని పోలీసులు భయపడి చచ్చారు. పోలీసులు ఆర్మీ వెహికల్ ను చేజ్ చేస్తున్న సమయంలో ప్రజలు ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో హమ్మయ్యా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామంటూ వర్జీనియా ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates