వీడెవడండీ బాబూ : బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిల కోసం వాలంటైన్స్ డే ప్యాకేజ్

kycశేఖర్ గుప్తా(26) గుర్గావ్ లోని ఓ వ్యాపారవేత్త. వాలంటైన్స్ డే రోజున బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిల కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకువచ్చాడు. చేతులు పట్టుకోవడం, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, లిప్ లాక్ కిస్ లను కావాలనుకునే అమ్మాయిల కోసం నాలుగు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాడు. ఇతను ఓ సాఫ్ట్ వేర్ సంస్థ CEOగా పని చేస్తున్నాడు.

ఫన్ కోసమే ఈ పని చేస్తున్నట్లు శేఖర్ తెలిపారు. ఈ ప్యాకేజీలకు సంబంధించిన వివరాలను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ‘RICHGUY’ అనే ప్రోమో కోడ్ ను ఉపయోగిస్తే ప్యాకేజీలో 20 శాతం తగ్గింపు కూడా ఇచ్చాడు. అంతే కాకుండా తన ఆడి కారులో ఫ్రీ రైడ్ ఉంటుందని తెలిపాడు. ఫేస్ బుక్ లోని తన పోస్ట్ కు వేల సంఖ్యలో రిప్లయిలు, షేర్లు వస్తుండటం.. కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. దీనిపై శేఖర్ స్పందించాడు. కేవలం ఫన్ కోసమే ఈ పని చేస్తున్నట్లు తెలిపాడు. ప్రేమపై తన అభిప్రాయం అడిగినప్పుడు.. దేవుడి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ప్రేమ అని.. దీనికి ఎవరూ వెల కట్టలేరని తన అభిప్రాయాన్ని తెలిపాడు శేఖర్. ఈ రోజు వరకు 20వేల కామెంట్లు వచ్చాయి.

Posted in Uncategorized

Latest Updates