వీధి కుక్కుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్ధి

janవీధి కుక్కల దాడిలో ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు.  ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ రోజు(ఫిబ్రవరి27) ఉదయం బలిజపేట మండలం అంపావల్లి  గ్రామంలో జస్వంత్(14) అనే తొమ్మిదవ తరగతి విద్యార్ధి స్కూలుకు వెళ్తున్న సమయంలో 10 వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేసి జస్వంత్ తల, మెడ భాగంలో తీవ్రంగా గాయపర్చాయి. దీంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు జస్వంత్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే  జస్వంత్ చనిపోయాడు. అయితే 4 నెలల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు కుక్కల దాడిలో చనిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బారి నుంచి తమను రక్షించాలని అధికారులను కోరుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates