వీధి బాలలు కన్పిస్తే..ఆయన బడిలో చేర్పిస్తారు

PRAKASHపేదరికంతో చదువుకు దూరం అయిన ఓ వ్యక్తి…తనలా ఎవరూ చదువుకోకుండా ఉండకూడదనుకున్నారు. దీనికి పేదరికం అసలే కారణం కాకూడదనే లక్ష్యంతో విధి బాలల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఆర్ధిక స్థోమత లేక చదువుకోలేని వీధి బాలలు ఎక్కడ కనిపించినా…వారిని బడిలో జాయిన్ చేయడమే లక్ష్యం పెట్టుకున్నారు.

ఒడిషాలోని కటక్‌ ప్రాంతానికి చెందిన  61 ఏళ్ల ప్రకాశ్ రావు . పేదరికం కారణంగా చదువుకోలేక పోయాడు. తండ్రితో పాటే టీ స్టాల్‌లో పనిచేసేవారు. దాంతో చదువు ముందుకు సాగలేదు. అయితే తన చిన్నతనం ఎలా అయితే చదువుకు దూరమైందో.. అలా మిగిలిన పిల్లలది కాకూడదనే లక్ష్యంతో “ఆశ ఆశ్వాసన్” పేరుతో అక్షరయజ్ఞం ప్రారంభించారు. 2000లో ప్రారంభించిన  ఈ కార్యక్రమం గత 18 ఏళ్లుగా కొనసాగుతోంది. తాజాగా ప్రధాని మోడీ తన మన్‌కీ బాత్‌లో ప్రకాశ్ ప్రస్తావన తీసుకురావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆయనపై పడింది. వీధి బాల‌లు ఎక్కడ క‌నిపించినా వారిని తీసుకు వెళ్లి తన స్కూల్లో జాయిన్ చేయడమే ప్రకాశ్ పని.

Posted in Uncategorized

Latest Updates