వీధుల్లో రచ్చ రచ్చ : సిటీ మొత్తం ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు

ghmc-foothpathsహైదరాబాద్ సిటీలో ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది GHMC. అందుకోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విభాగం ప్రత్యేకంగా ఆరు బృందాలు ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఇబ్బందిగా ఉన్న ఆక్రమణలను తొలగించాలని కోర్టు కూడా GHMCని ఆదేశించింది. దీంతో శనివారం నుంచి ఫుట్ ఫాత్ లపై ఉన్న ఆక్రమణల తొలగింపును జీహెచ్ఎంసీ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం పోలీసు, ట్రాఫిక్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అవసరమైన పనిముట్లు, యంత్రాలను కూడా రెడీ చేశారు. నగరంలోని 48 ప్రాంతాల్లో 121 కిలోమీటర్ల ఫుట్ పాత్లపై 5 వేల ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని వారం రోజుల్లోనే తొలగించాలని టార్గెట్ పెట్టుకున్నారు.

ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు వ్యర్ధాలను తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంటారు. ఆక్రమణలు తొలగించడమే కాదు.. చలాన్లు కూడా వేస్తారు. ఏకకాలంలో ప్రత్యేక బృందాలు.. తొలగింపు ప్రక్రియ చేపడతాయి. ప్రధాన రహదారులతో పాటు కాలనీలకు వెళ్లే ఫుట్ పాత్లపై సెక్యూరిటీ గదులు, మెట్లు ఏర్పడగా కొన్ని ప్రాంతాల్లోని ఫుట్ పాత్ లు వాహనదారులకు రోడ్లుగా మారాయి. వాహనాల రద్దీ తీవ్రంగా ఉన్న సమయాల్లో ద్విచక్ర వాహనదారులు ఫుట్ పాత్ పైనే డ్రైవ్ చేస్తుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వీటిని ఆక్రమించి అద్దెలకు కూడా ఇచ్చుకుంటున్నారు. అబిడ్స్, అమీర్ పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగుడా, కోఠి, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్ ఏరియాల్లో ఈ దందా ఎక్కువగా సాగుతోంది.

ఆక్రమణల తొలగింపుతో రోడ్డున పడ్డామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ విధంగా జీవనోపాధి పొందుతున్నాం అని.. ఇప్పుడు ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోవాలంటే.. అక్కడికి కస్టమర్లు ఎలా వస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates