వీరి స్కెచ్ బీభత్సం : ఆన్ లైన్ ఎగ్జామ్ లోనూ హైటెక్ చీటింగ్

onlineకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్టాఫ్ట్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) పరీక్షలో హైటెక్‌ మోసం వెలుగుచూసింది. చీటింగ్ కు పాల్పడుతున్న నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి రూ.50లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆన్‌లైన్‌ పరీక్ష పాస్‌ చేయిస్తామని అజయ్ (30), సోను(31), గౌరవ్(24), పరంజీత్(24) అనే నలుగురి వ్యక్తులు అభ్యర్థులతో డీల్ కుదుర్చుకున్నారు. ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 10లక్షల రూపాయలు వసూలు చేశారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ ను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. దీని అవకాశంగా తీసుకుని.. టీమ్‌ వ్యూయర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఈ నలుగురు SSC నిర్వహిస్తున్న CHSL టైర్‌-1 పరీక్షలో మోసానికి పాల్పడ్డారు.

అభ్యర్థులు ఏ కంప్యూటర్ నుంచి అయితే ఎగ్జామ్ రాస్తున్నారో.. దాని నుంచి వారు సాఫ్ట్ వేర్ సాయంతో లాగిన్ అయ్యి.. వీరు ఎగ్జామ్ చేశారు. ఈ వ్యవహారానికి సూత్రధారి ఢిల్లీ సేల్స్‌ టాక్స్‌ డిపార్టమెంట్‌లో పని చేస్తున‍్న హర్‌పాల్‌ కావటం విశేషం. గతంలో మాన్యువల్‌ గా నిర్వహించే ఈ పరీక్షలో అవకతవకలకు అవకాశం ఉండకూడదన్న ఉద్దేశంతో కొంతకాలం నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇందులోనూ కొత్తరకం మోసాలు జరుగుతుండటంతో విస్తుపోయారు అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates