వీరు మారరు : సెల్ఫీ కోసం వచ్చిన అభిమానికి కొట్టిన మంత్రి

dks2018ఈ మధ్య కాలంలో రాజకీయ నేతలు, సెలబ్రెటీలు కనిపిస్తే చాలు.. సెల్ఫీలు దిగేందుకు కొంతమంది యువకులు ప్రయత్నిస్తుంటారు. ఇలా సెల్ఫీలు దిగడం కొందరికి ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఘటనే. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం ( ఫిబ్రవరి-5) బళ్లారికి వచ్చారు. మంత్రి శివకుమార్‌తో సెల్ఫీ దిగేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు.

దీంతో ఆగ్రహం తెచ్చుకున్న మంత్రి.. సదరు యువకుడి చేయిపై బలంగా కొట్టాడు. ఈ క్రమంలో ఫోన్ కూడా కిందపడిపోయింది. మంత్రితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన మరికొందరు.. తక్షణమే తమ ఫోన్లను జేబుల్లో పెట్టేసుకున్నారు. డీకే శివకుమార్ ఇలా ప్రవర్తించడం రెండోసారి. గతంలోనూ ఓ సభలో అభిమాని సెల్ఫీ దిగేందుకు వస్తే.. చేయిచేసుకున్నాడు. దీంత రాజకీయనాయకులు ఏమాత్రం సహనం పాటించడంలేదని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.

Posted in Uncategorized

Latest Updates