వీరే హీరోలు : IPL -11 హైలైట్స్

RISHABమండువేసవిలో క్రికెట్ అభిమానులను అలరించిన IPL సీజన్-11 ఆదివారం (మే-27) ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఘనంగా ముగిసింది. 51 రోజులపాటు హోరాహోరీ పోరాటాలు…లీగ్, ప్లే ఆఫ్‌ సహా 60 మ్యాచ్‌ లు…8 టీమ్స్… 100 మందిపైగా ప్లేయర్స్…4 సెంచరీలు… 101  హాఫ్ సెంచరీలు…1 వెయ్యి 621 బౌండరీలు… 853 సిక్సర్లు…మైమరిపించిన ఫీల్డింగ్‌ విన్యాసాలు…ఔరౌరా అనిపించిన క్యాచ్‌ లు…కళ్లు చెదరగొట్టిన మెరుపు ఇన్నింగ్స్‌ లు…ఉత్కంఠతో కుదిపేసిన ఛేదనలు…కట్టిపడేసిన బౌలింగ్‌ మాయాజాలాలు…ఊహకందని కెప్టెన్ల వ్యూహాలు…మైదానంలో రంగురంగుల హంగులు…చీర్‌ లీడర్ల నృత్యాల హొయలు…నరనరాన అభిమానం నింపుకొన్న  క్రికెట్ అభిమానుల మధ్యన ఫైనల్ గా ..ట్రోఫీని ముద్దాడింది చెన్నై సూపర్ కింగ్స్. ఓరల్ గాఈ సారి తమ ట్యాలెంట్ ను నిరూపించుకున్నవారికి అవార్డులు, రివార్డులతో సత్కరించింది IPL.

IPL-11 ఉత్తమ ప్లేయర్స్ వివరాలు
-ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌ మన్‌–రూ.10 లక్షలు) విలియమ్సన్‌ (సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌–735 పరుగులు)
-పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌–రూ. 10 లక్షలు) ఆండ్రూ టై (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌–24 వికెట్లు)
-పర్‌ ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌ (రూ. 10 లక్షలు): ట్రెంట్‌ బౌల్ట్‌ (ఢిల్లీ డేర్‌డెవిల్స్‌)
-ఎమర్జింగ్‌ ప్లేయర్‌ (రూ. 10 లక్షలు): రిషభ్‌ పంత్‌ (ఢిల్లీ డేర్‌డెవిల్స్‌–684 పరుగులు)
-మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ (రూ. 10 లక్షలు): సునీల్‌ నరైన్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)
-సూపర్‌ స్ట్రయికర్‌: సునీల్‌ నరైన్‌ (నెక్సా కారు–కోల్‌కతా నైట్‌రైడర్స్‌)
-స్టయిలిష్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌ (రూ. 10 లక్షలు): రిషభ్‌ పంత్‌ (ఢిల్లీ డేర్‌డెవిల్స్‌)
-నయీ సోచ్‌ సీజన్‌ అవార్డు: చెన్నై కెప్టెన్‌ ధోని (రూ. 10 లక్షలు)
-ఫెయిర్‌ ప్లే అవార్డు: ముంబై ఇండియన్స్‌
-ఉత్తమ మైదానం: ఈడెన్‌ గార్డెన్స్, కోల్‌కతా (రూ. 50 లక్షలు)
-రన్నరప్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (రూ. 12 కోట్ల 50 లక్షలు)
-విన్నర్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (రూ. 20 కోట్లు)

విశేషాలు…

-735 విలియమ్సన్‌ చేసిన పరుగులు. ఒక సీజన్‌లో 700కు పైగా పరుగులు చేసిన నాలుగో ఆటగాడు. గతంలో కోహ్లి (973–2016లో), వార్నర్‌ (848–2016లో), గేల్‌ (733–2012లో) ఈ ఘనత సాధించారు.
40తో ఈ సీజన్‌లో చెన్నై, రైజర్స్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచింది. IPL లో ఇలా జరగడం ఇదే తొలిసారి.
– కరణ్‌ శర్మ వరుసగా మూడేళ్లు మూడు వేర్వేరు జట్ల తరఫున ఆడి, IPL విజయాల్లో భాగమయ్యాడు. సన్‌ రైజర్స్‌ (2016), ముంబై (2017), చెన్నై (2018).
– కెప్టెన్‌ గా టి20ల్లో ధోనికి ఇది 150వ విజయం. మరే కెప్టెన్‌ కూడా 100 మ్యాచ్‌ లు గెలిపించలేదు.

Posted in Uncategorized

Latest Updates