వీల్‌ చైర్‌ పై ‘గాంధీ’

హైదరాబాద్ : గాంధీ హాస్పిటల్లో డాక్టర్ల కొరత పెద్దగా లేదు. సర్జన్లు,మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యార్థులు అందుబాటులో ఉంటున్నారు.కానీ ఎంత వెదికినా నర్సు లు, ఆయాలు మాత్రం కన్పించరు. 3 వేల ఓపీ, 2 వేల మంది ఇన్‌ పేషెంట్లకు సేవలందించేందుకు కనీసం వెయ్యిమంది  నర్సులు అవసరం కాగా 400 మందే ఉన్నారు. వారిలో వంద మంది రోజూ సెలవుల్లో ఉంటున్నారు. మూడు షిఫ్టుల్లో 300 మందే డ్యూటీలో ఉంటున్నారు.దీంతో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు…రాష్ట్రంలో మరే ఆసుపత్రికి లేనంత స్థాయిలో భవనాలు, వైద్య సదుపాయాలున్నా చిన్నచిన్న సమస్యలు ఏళ్లకేళ్లుగా పరిష్కారం కాకపోవడంతో గాంధీ ఆస్పత్రిలో రోగులు అల్లాడుతున్నారు. వీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్లు , సిబ్బంది కొరత ప్రధాన సమస్యలుగా కన్పిస్తున్నాయి.ఏ విభాగంలో చూసినా వృద్ధులను, వికలాంగులను, గాయాలపాలైన  వారినీ రెక్కలు పట్టుకొని నడిపించి తీసుకెళ్తున్న దృశ్యాలే కన్పిస్తున్నాయి. ఆస్పత్రికి దాతలు ఏటా వందల సంఖ్యలో వీల్‌‌‌‌ చైర్స్‌‌‌‌ ను ఇస్తుంటారు.

కానీ ప్రస్తుతం  ఓపీలో ఉన్న వీల్ చైర్స్ సంఖ్య కేవలం 13. మిగతావి ఆసుపత్రిలో ఎక్కడ చూసినా రిపేర్లతో కుప్పలుగా పడి ఉన్నాయి. రోజూ ఓపీకి వచ్చే రోగులు 3 వేల మందికిపైగా ఉంటారు. ఎమర్జెన్సీకి వచ్చే ప్రతి రోగికీ వీల్‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్ లేదా స్ట్రెచర్ అవసరం ఉంటుంది. ఇంతకు ముందు సేవాభారతి అనే స్వచ్ఛంద సంస్థ ఇద్దరు వ్యక్తుల్ని నియమించి రోజూ వీల్ చైర్స్ రోగులకు ఇచ్చి తిరిగి తీసుకునేది.ఇప్పుడు ఆ సౌకర్యం బందైంది. దీంతో కొన్నిసార్లు వైద్యం కంటే ‘వీల్ చైర్’ దొరకడమే ప్రధాన సమస్యగా మారింది. నడవలేని స్థితిలో ఆసుపత్రికి వచ్చే రోగి మళ్లీ నడిచేదాకా వీల్ చైర్ అవసరం ఉంటుంది. దీంతో చాలామంది రోగులు ఓసారి తీసుకున్న వీల్‌‌‌‌ చైర్స్‌‌‌‌ ను డిశ్చార్జి అయ్యేదాకా వెనక్కి ఇవ్వడం లేదు. వార్డ్‌ బాయ్‌ పేషెంట్లను వార్డుల్లోకి చేర్చి చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెచ్చి మళ్లీ భద్రపర్చాలి. కానీ ఆస్పత్రిలో వార్డ్ బాయ్స్ జాడ కన్పించడం లేదు. ఆస్పత్రి మొత్తమ్మీద 10, 20 మంది మాత్రమే ఉన్నారు. ‘‘కొంతమంది సిబ్బంది వాళ్లకు కావాల్సిన పేషెంట్ల కోసం వీల్ చైర్స్ ను బాత్ రూమ్స్, స్టాఫ్ రూమ్స్ లో దాచేస్తున్నారు. వాటిని బయటికి ఇవ్వడం లేదు’’ అని ఆసుపత్రిలో పని చేసే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్త తెలిపారు.

కనీసం వెయ్యి మంది నర్సులు కావాలి

గాంధీ హాస్పిటల్లో ఓపీ, ఇన్‌ పేషెంట్లు కలిపి 5 వేల మంది దాకా ఉంటారు. వారికి సేవలందించేందుకు కనీసం వెయ్యి మంది నర్సులు ఉండాలి. కానీ రోజూ 300 మందే అందుబాటులో ఉంటున్నారు. ‘డాక్టర్లు ఎందరు ఉన్నా నర్సుల కొరత వల్ల రోగులకు సేవలు అందడం లేదు. ఆ బాధ మాకూ ఉంది. కానీ ఒక్క నర్సు ఎంత మందిని చూసుకోగలదు? కాంట్రాక్టు నర్సులనైనా తీసుకుంటే మేం శిక్షణ ఇస్తాం. కానీ అది కూడా చేయడం లేదు’ అని ఓ హెడ్ నర్స్ అన్నారు.

పత్తా లేని ఆయాలు, వార్డ్ బాయ్ లు

వేల మంది రోగులున్నా ఆస్పత్రిలో ఉన్న ఆయాలు 200 మందే. గాంధీలో సుమారు 30 డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. ఒక్కో వార్డులో ఇద్దరు ఆయాలు, ఒక వార్డ్ బాయ్ ఉండాలి. కానీ ఫ్లోర్ మొత్తానికీ కలిపి ఒక్కరు కూడా ఉండడం లేదు. ఉన్న అరకొర వార్డు బాయ్స్ రోగులకు ఆహారం  పంపిణీలో ఉంటుంటే…ఆయాలకు  రోజంతా బెడ్ షీట్లు మార్చేందుకు సరిపోతోంది.  దీంతో 98 శాతం రోగులకు ఆయాలు, వార్డు బాయ్స్ సేవలు అందడం లేదు. ఆయాలను, వార్డ్ బాయ్స్‌‌‌‌ ను 1994 తర్వాత నుంచి తీసుకోలేదు. ఎప్పటికప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల్ని తీసుకుంటున్న వారిలో జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగేది అంతంతే. రోగులకు సహాయకులుగా ఏజిల్ గ్రూప్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పని చేస్తున్నా.. 5 శాతం  కూడా అవసరాలు తీరడం లేదని రోగులు అంటున్నారు.

వైద్య పరికరాలున్నా వాడకం లేదు

గాంధీలో ఎన్నో జబ్బులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రా సౌండ్ వంటి ఆధునిక పరికరాలున్నాయి. చిన్నచిన్న రిపేర్లు రావడంతో వాటిలో చాలా నిరుపయోగంగా ఉంటున్నాయి. సీటీ స్కాన్ తీసుకోవాలంటే రోగి వారం రోజులకు పైనే నిరీక్షించాల్సి వస్తోంది. రక్త పరీక్ష కూడా ఒక్క రోజులో కావడం లేదు. తీవ్రమైన రోగాలతో బాధపడే వారు పరీక్షల కోసమే రోజులు, వారాల తరబడి నిరీక్షిస్తున్నారు.

రోగుల్ని తీసుకెళ్లేందుకు దారేది?

కొన్నాళ్ల వరకు గాంధీలో వాహనాలకు పెయిడ్ పార్కిం గ్ ఉండేది. అప్పుడు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది వాహనాల పార్కిం గ్ చూసుకునేవారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఫ్రీ పార్కిం గ్ పెట్టాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రైవేటు సిబ్బందిని తొలగించారు. ఇప్పుడు రోగుల్ని లోనికి తీసుకెళ్లేందుకు  దారి లేనంతగా ఆవరణలో ఎటు చూసినా కార్లు, ఆటోలు, బైకులే కనిపిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates