వీళ్లు చాలా లగ్జరీ : బాబాలకి కేబినెట్ మినిస్టర్ హోదా

babaమధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదుగురు బాబాలకు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది. వీళ్లు హిందూ మతం ప్రచారం చేస్తుంటారు. కొన్నేళ్లుగా బాబాలుగా సమాజంలో చలామణి అవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా వీరిని ప్రభుత్వంలోకి తీసుకోవటం దేశాన్ని షాక్ కు గురి చేసింది. కేబినెట్ మినిస్టర్ హోదా కల్పించిన ఐదుగురు బాబాల వివరాలు ఇలా ఉన్నారు.

కంప్యూటర్ బాబాగా చలామణి అవుతున్నారు ఇండోర్ కి చెందిన ఈ వ్యక్తి. మూడేళ్ల క్రితం జరిగిన కుంభమేళా ఘాట్స్ దగ్గర నేరుగా హెలికాఫ్టర్ నుంచి దిగేందుకు ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద పాపులారిటీ సంపాదించారు. ల్యాప్ ట్యాప్, మొబైల్ లేకుండా అడుగు బయట పెట్టడు. దీంతో అందరూ కంప్యూటర్ బబా అంటారు. ఇతని అసలు పేరు నందియో దాస్ త్యాగి. మరో బాబా పండిట్ యోగేంద్ర మహన్. నర్మదా నది ప్రక్షాళన కోసం చేపట్టిన క్యాంపెయిన్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితోపాటు బైయ్యూ మహారాజ్, నర్మదానంద్ మహారాజ్, హరిహరానంద్ మహారాజ్ లు కూడా కేబినెట్ ర్యాంక్ పొందారు. వీరు ఐదుగురు బాబాలు కొన్నేళ్లుగా నర్మదా నది ప్రక్షాళన, శుద్ధి చేపట్టాలని ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఐదుగురు బాబాలను నర్మద నది అంశానికి సంబంధించిన కమిటీలో సభ్యులుగా నియమించింది శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం. ఈ తర్వాత వారం రోజులకే కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ సెక్యూరిటీ ఇచ్చింది.

Posted in Uncategorized

Latest Updates