వీళ్లు దేశముదుర్లు : లోకల్ టీవీలకు ఇంటర్నేషనల్ బ్రాండ్

tvఇలా కూడా మోసం చేస్తారా.. ఇలా కూడా జరుగుతుందా.. మన ఇంట్లోకి వచ్చిన బ్రాండెడ్ టీవీ నకిలీదా.. సేమ్ టూ సేమ్ సోనీ కంపెనీ అట్టపెట్టెలు, స్టిక్కర్స్ వేసి మార్కెట్లో అమ్మేస్తున్నారా.. సోనీ కంపెనీ టీవీ అని లక్షలు పెట్టి కొన్నది.. లోకల్ మార్కెట్ లో తయారు అయ్యిందా.. హైదరాబాద్ లో ఇలాంటి టీవీలు కూడా అమ్మకం జరుగుతుందా.. ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఒకటే. అవును.. అవును.. అవును. ఇది మేం చెబుతున్న మాట కాదు.. రాచకొండ పోలీస్ కమిషననర్ మహేష్ భగవత్ మైక్ ముందు బల్లగుద్ది మరీ చెప్పారు.

హైదరాబాద్ సిటీలో సోనీ టీవీల పేరుతో నకిలీ టీవీలు అమ్మకం సాగుతుందన్న సమాచారంతో నిఘా పెట్టారు ఎల్బీ నగర్ SOT పొలీసులు. ఈ క్రమంలోనే దిల్ ఖుష్ నగర్ లోని చైతన్యపురిలోని ఓ గోదాంపై దాడి చేశారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ఎల్ఈడీ టీవీలను అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు.  చైతన్య పురిలోని గోదాంలో ఉన్న 51 నకిలీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. సోనీ కంపెనీ పేరుతో.. ఈ టీవీలను అమ్ముతోంది ముఠా. తక్కువ ధరకు టీవీలు వస్తున్నాయని ఆశపడి.. మోసపోవద్దన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్.

సోనీ కంపెనీ షోరూంలో సుమారు 50వేల రూపాయలు ఉండే టీవీని వీరు.. 30వేల రూపాయలకే అమ్ముతారు. ఎందుకు అంటే.. తయారీ ఫ్లాంట్ లో చిన్నచిన్న మరకలు పడితే వాటిని పక్కన పడేస్తారని.. అలాంటి టీవీలను తక్కువ ధరకి అమ్ముతున్నామని చెబుతున్నారు. అందుక తగ్గట్టుగానే బాక్స్ లు అన్నీ కూడా సేమ్ టూ సేమ్ సోనీ కంపెనీ బాక్సుల్లాగే ఉంటాయి. దీంతో మధ్య తరగతి ప్రజలు తక్కువ ధరకు పెద్ద టీవీ వస్తుంది కదా అనే ఆశతో వీటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు.

Posted in Uncategorized

Latest Updates