వీళ్లు మనుషులేనా : పసికందుని నడి రోడ్డుపై పడేసి వెళ్లారు

UPఉత్తరప్రదేశ్ లో హృదయవిదారకమైన ఘటన జరిగింది. పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందును ఓ మహిళ  కొంచెం కూడా జాలి, దయ లేకుండా ఓ వీధిలోని ఇంటి గుమ్మం ముందు వదిలి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్‌ లోని ముజఫర్‌ నగర్‌లో ఈ సంఘటన జరిగింది.

ముజఫర్ నగర్ లో నిర్మానుష్యంగా ఉన్న ఓ వీధిలో కారులో వెళ్తూ ఓ ఇంటి గుమ్మం ముందు  ఓ టవల్ లో చుట్టి ఉన్న చిన్నారి పాపను గుర్తు తెలియని మహిళ కారు కిటికీలో నుంచి కిందకు వంగి ఇంటి ఎదుట వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడి సీసీటీవీలో ఈ విజువల్స్ రికార్డయ్యాయి. చిన్నారిని ఏడుపు విని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు  జిల్లా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు  సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. పసిపాపలు అన్న కనికరం కూడా లేకుండా రోడ్లపై, చెత్త కుప్పల్లో, హాస్సిటల్స్ బాత్రూంలలో చిన్నారులను వదిలివెళ్లున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం.

Posted in Uncategorized

Latest Updates