వీళ్లు మనుషులేనా : ప్లాస్టిక్ కవర్ లో చుట్టి చిన్నారిని రోడ్డుపై వదిలేశారు

mainపొత్తిళ్లో ఉండాల్సిన పసికందును ప్లాస్టిక్ వర్ పెట్టి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు కసాయి తల్లిదండ్రులు. బెంగళూరు లోని రామయ్య లేఔట్ లో ఈ ఘటన జరిగింది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఏరియాలో అప్పుడే పుట్టిన పాపను రోడ్డుపై వదిలేసి వెళ్లిన, ఆ తర్వాత చిన్నారి చనిపోయిన ఘటన జరిగి నెల గడవక ముందే ఇప్పుడు మరొక ఘటన జరిగింది.

గురువారం(జూన్-21) బెంగళూరులోని రామయ్య లేఔట్ లో ప్లాస్టిక్ కవర్ లో పెట్టి రోడ్డు పక్కన పడేసి ఉన్న చిన్నారిని గుర్తించారు స్ధానికురాలు సుధావాసన్. ఉదయం నాలుగు గంటల సమయంలో రొడ్డుపై ఏడుస్తున్న శబ్ధం వినిపిస్తుండటంతో ఇంటి బయటకు వచ్చి చూసిన సుధా… మెదట పిల్లి అని భావించి తిరిగి ఇంట్లోకెల్లి పడుకున్నారు. అయితే చిన్నారి గుక్కపెట్టి పెద్దగా ఏడుస్తుండటంతో… ఆ ఏడుపు పసిపాప ఏడుపేనని గుర్తించి వెళ్లి చూడగా ప్లాస్టిక్ కవర్ లో పలుచని టవల్ తో చుట్టి ఉన్న పసిపాప ఆమెకు కన్పించింది. చిన్నారికి బోడ్డు కూడా కట్ చేయకుండా ఉన్న ఆ పసికందుని వెంటనే ప్లాస్టిక్ కవర్ నుంచి బయటకు తీసింది. వెంటనే తన కొడుకు సాయంతో ఆ పసికందు బళ్లంతా శుభ్రం చేసి వెంటనే సాయం కోసం చుట్టుపక్కల ఇళ్లవారిని సాయం కోరింది. ఆ తర్వాత బనసవాడి పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు చిన్నారిని ఓఉమ్ హాస్పిటల్ కు తరిలించారు. చిన్నారి హార్ట్ బీట్ బాగానే ఉన్నా  చిన్నారి శరీరం అంతా చల్లగా ఉన్నట్లు తెలిపారు. చిన్నారికి అవసరమైన ట్రీట్ మెంట్ చేస్తున్నామని పరిస్ధితి మెరుగుపడుతుందని డాక్టర్లు తెలిపారు. పుట్టిన రెండు గంటలకే చిన్నారిని రోడ్డుపై వదిలేసి వెళ్లినట్లు ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ba

Posted in Uncategorized

Latest Updates