వీళ్లు మనుషులేనా..వంద కుక్కలను కాల్చి చంపారు

DOGS FIRESమూగ జీవులపట్ల దారుణంగా ప్రవర్తించారు. ఒకటి కాదు..రెండు కాదు..వంద కుక్కలను కాల్చి చంపారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని మీర్ పేట సమీప అడవిలో శుక్రవారం (మే-18) జరిగింది. బస్తీలో కుక్కల బెడద ఎక్కువగా ఉండటంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మీర్ పేట నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వంద వీధి కుక్కలను సమీపంలోని కొంగర అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి చంపారు. ఈ క్రమంలో అడవిలో కుక్కల అరుపులు..బాధలు వర్ణణాతీతం. ఈ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదు చేయడంతో జంతుహివస కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

పశుసంవర్ధకశాఖ వైద్యులు కుక్కల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించి.. వాటి శాంపిళ్లను పరీక్ష కోసం లేబోరేటరీకి పంపించినట్లు చెప్పిన పోలీసులు.. ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుక్కల బెదద ఉంటే సమాచారాన్ని అందించాలి కానీ..ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని..ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates