వీళ్లు మర్యాద రామన్నలు : బాధితుల పరామర్శల్లోనూ ఇగో ఫీలింగ్

MPవారు మాములోళ్లు కాదు.. ఈ భూమ్మీదకు దేవుడి పంపించినట్లు.. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల దగ్గరకే మర్యాద కోరుకున్నారు. తప్పులేదు.. కాకపోతే అత్యాచారానికి గురై.. ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి కూడా మర్యాద, మన్ననలు, దండాలు కోరుకోవటం ఎంత వరకు సబబు.. కచ్చితంగా కాదు.. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ ఎంపీ మాత్రం ఇలాగే కోరుకున్నారు.. పక్కనోళ్లు చెబుతున్నా వారించకుండా బాధిత కుటుంబాన్ని ఓదార్చటానికి వచ్చి మరీ మర్యాదలు, దండాలు పెట్టించుకున్నారు. ఇదంతా కెమెరాల్లో రికార్డ్ అయ్యి.. ఎంపీ గారి పరువు గంగపాలు అయ్యింది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌన్ అనే టౌన్ లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత బాలికపై ఇనుప రాడ్ తో దాడి చేశారు. ఇప్పుడు ఆ బాలిక ఇండోర్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయంపై ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. విషయం మరింత పెద్దది కాకముందే.. స్థానిక ఎంపీ సుధీర్ గుప్తా రంగంలోకి దిగారు. ఆస్పత్రికి వెళ్లి బాధితురాలితోపాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడి వరకు ఒకే.. ఇక్కడే ఓ అత్యుత్సాహం ప్రదర్శించాడు లోకల్ ఎమ్మెల్యే సుదర్శన్. ఎంపీగారు మిమ్మల్ని పరామర్శించటానికి ఎంతో దూరం నుంచి వచ్చాడు.. ఆయనకు లేచి కృతజ్ణతలు చెప్పండి అంటూ అందరి ముందు ఆ బాధిత కుటుంబ సభ్యులను కోరాడు. అంత బాధల్లో ఉన్నవారు.. ఎమ్మెల్యే చెప్పగానే లేచారు. ఎంపీగారికి దండం పెట్టారు. ఆయన ముందు ఎడుస్తూ జరిగిన ఘోరం, బాలిక ఆరోగ్యం గురించి చెప్పారు. ఇదంతా ఆ పక్కనే ఉన్న మీడియా కెమెరాల్లో చిక్కింది.

బాధితులను పరామర్శించటానికి వచ్చిన ఎంపీకి ఏం మర్యాదు తగ్గిందో అంటూ ఇప్పుడు మండి పడుతున్నారు. ప్రతిపక్షాలు అయితే దుమ్మెత్తిపోశాయి. దీంతో బీజేపీ సీనియర్స్ కూడా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన పని సరైంది కాదని ఆ పార్టీ మధ్యప్రదేశ్ అధికార ప్రతినిధి వివరణ కూడా ఇచ్చారు. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందరూ విమర్శిస్తూ, తిట్టిపోస్తున్నారు ఆ ఎంపీ, ఎమ్మెల్యేలను…

Posted in Uncategorized

Latest Updates