వీళ్లు మామూలు దొంగలు కాదు : సిగ్నల్ వైర్లు కట్ చేసి, రైల్లో చోరీలు

రైల్లో చోరీకి పాల్పడేందుకు దొంగలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. అడవి మధ్యలో రైలు ఆగే విధంగా సిగ్నల్ కట్ చేసి మరీ దోచుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్లాన్ పనిచేయకపోవడంతో పరారీ అయ్యారు. ఈ సంఘటన బుధవారం (జూలై-11) తాడిపత్రి మండలం వంగనూరు గ్రామంలోని రైల్వే స్టేషన్ వద్ద సిగ్నల్ వైర్లు కట్ చేసిన దొంగలు.. చెన్నై నుండి కాచిగూడ వస్తున్న రైల్లో చోరీకి ప్రయత్నించారు. మహిళ మెడలోని గొలుసును లాక్కోవడానికి ప్రయత్నం చేయగా.. మహిళ గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న GRP పోలీస్ ఒక రౌండ్ ఫైర్ చేశారు. దీంతో భయంతో  రైలు నుండి పారిపోయారు దొంగలు.  పదిహేను రోజులలో అనంతపురం జిల్లాలో ఇదే తరహాలో (నాలుగు) వరసగా నాలుగు చోరీలు జరిగాయని తెలిపారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates