వీళ్లు మారరు : రైలు డోర్ దగ్గర నిలబడి.. గాలికి జారిపడిన యువతి

బస్సు, రైలు ప్రయాణాలు చేసేటప్పుడు డోర్ దగ్గర నిలబడకూడదనేది రూల్. ఎన్నిసార్లు అధికారులు జాగ్రత్తలు చెప్పినా కొందరు పెడచెవిన పెడతారు. ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా పోజు కొడుతూ, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని.. డోర్ దగ్గరే నిలబడతారు. ఈ వైరల్ వీడియోలోనూ ఓ అమ్మాయి అలాగేచేసి.. ప్రాణాలమీదకుతెచ్చుకుంది. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి.. ఇయర్ ఫోన్ లో పాటలు వింటూ డోర్ దగ్గర నిలబడి ఉంది. పక్క ట్రాక్ నుంచి మరో రైలు వేగంగా వచ్చేసరికి.. ఆ గాలికి డోర్ దగ్గరున్న అమ్మాయి ఒక్కసారిగా కిందకు జారిపోయింది. వెంటనే పక్కనే ఉన్నవారి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని పైకి లాగారు. అలా బతికిపోయింది. కొంచమైతే రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయేది. తర్వాత అమ్మాయికి బోగీలో ఉన్నవారు క్లాస్ పీకారు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఓ చోట కూర్చోక… డోర్ దగ్గర నిలబడి అంత నిర్లక్ష్యంగా ఉండటం అవసరమా అంటూ తిట్లపురాణం మొదలెట్టారు. ఇకనైనా ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్త వహించండి అన్నారు.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైలు ప్రమాదంలో ఎక్కువగా చనిపోయినవారిలో అమ్మాయిలే ఉన్నారని.. అందులో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నవారే ఎక్కువ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. చావు చివరంచుల దాక వెళ్లి రావడం అంటే బహుశా ఇదేనేమో.

చావు చివరంచుల దాక వెళ్లి రావడం అంటే బహుశా ఇదేనేమో..దయచేసి రైలు ప్రయణం చేసేటప్పడు డోర్ వద్ద నిల్చున్నప్పుడు జాగ్రత్త…షేర్ చెయ్యండి..

Unmask India 发布于 2018年10月2日周二

Posted in Uncategorized

Latest Updates