వీ6 ఛానెల్ నుంచి కొత్త న్యూస్ పేపర్.. “వెలుగు”.. అతిత్వరలో

హైదరాబాద్ : “ప్రతి దృశ్యం – ప్రజల పక్షం” నినాదంతో తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయి.. తెలుగువారికి దగ్గరైన వీ6 న్యూస్ ఛానెల్ .. అతి త్వరలోనే కొత్త న్యూస్ పేపర్ ను తీసుకురాబోతోంది. “వెలుగు” పేరుతో అక్షర యాత్ర ఆరంభిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలోనే సరికొత్త ‘డెయిలీ న్యూస్ పేపర్’  “వెలుగు” రాబోతోంది. తెలుగువారి గడపగడపను చేరబోతోంది.

వార్తలు.. విశ్లేషణలు.. అభిప్రాయాలు.. వేటికవే వేరువేరుగా.. ‘జనంకోణంలో’ ఆవిష్కరించబోతోంది వీ6 వారి వెలుగు దినపత్రిక. చిల్లరమల్లర వీధి గొడవలను కాదు.. జనానికి పనికొచ్చే ఊరి వార్తలను కవర్ చేసి.. పేపర్ లో అందించబోతోంది.

ఉట్టుట్టి వార్తలు కాదు.. గట్టి సమాచారం అందించబోతోంది. మనకు నచ్చేవి.. పనికొచ్చేవి.. తెలియాల్సినవి.. తెలుసుకోవాల్సినవి.. అందరికోసం అన్ని వార్తలు అందించబోతోంది. వార్తా విలువలకు సరికొత్త వెలుగు తీసుకురానుంది.

అనేది.. వినేది.. చూసేది.. తినేది.. తాగేది.. జన పదం నుంచి.. యువపథం వరకు అందరికీ అర్థమయ్యేలా అందించబోతోంది.

అన్నీ ఉంటేనే లైఫ్. అన్నీ ఉండేదే “లైఫ్”. కొత్త “వెలుగు”తో.. సరికొత్త “లైఫ్” రాబోతోంది.

అన్నీ వార్తలే. వదంతులు రావు.. రూమర్లు కనిపించవు.. వార్తలు మాత్రమే “వెలుగు”లోకి రానున్నాయి. అన్ని రకాల వార్తలు.. జనానికి పనికొచ్చే వార్తలు.. జనాలందరి వార్తలు ఒకే పత్రికలో రాబోతున్నాయి.

తెలుగు పదాలనే వాడుక భాషలోకి కన్వర్ట్ చేసుకుని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదింక. అమ్మ భాష.. చదవగానే అర్థమయ్యే భాష….  ముచ్చట పెట్టుకున్నట్టు… ఎవరో పిలిచినట్టు.. మన దోస్త్ ఏదో చెబుతున్నట్టు.. మన భాషలో.. మన యాసలో వార్తలు రాబోతున్నాయి. కాలం చెల్లిన గ్రాంథిక పదాలకు దూరంగా.. వాడుక పదాలతో తెలుగు వార్తకు సరికొత్త “వెలుగు” రాబోతోంది.

Posted in Uncategorized

Latest Updates