వీ6 బతుకమ్మ సాంగ్-1 2018 విడుదల

తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే పూలపండుగ బతుకమ్మ వేడుకలకోసం ప్రత్యేకంగా రెండు కానుకలను వీ6 న్యూస్ ఛానెల్ అందిస్తోంది. ఒక పాటతో కాకుండా.. ఈసారి రెండు పాటలను తీసుకొచ్చింది. మన బతుకు… మన బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈ పాటలు వివరిస్తున్నాయి. పువ్వూ పువ్వూ ఏరి తెచ్చి.. బతుకమ్మను తీర్చిదిద్ది.. గౌరమ్మకు పూజలు చేయడం మన బతుకమ్మ పండుగ ప్రత్యేకత. ఇంటిముందు ముగ్గులు.. అలుకు చల్లి… ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణలు… కొత్త బట్టల కోలాహలం.. ఆడపడుచుల ఆటపాటల సందడి… ఎన్నో విశేషాలను నింపుకుని వచ్చేశాయి మన వీ6 బతుకమ్మ పాటలు. ఆ పాటల్లో మొదటి పాటను మీరూ ఓసారి చూసి అనందించండి. ఈ పాటను ప్రముఖ రచయిత డా.కందికొండ రాశాడు. భేలేశావలి సంగీతం అందించాడు. వరం, భోలేశావలి పాడారు.

 

Posted in Uncategorized

Latest Updates