వృత్తి విద్యాకోర్సుల్లో స్పోర్ట్స్ కోటా వద్దు: హైకోర్టు

highcourtవృత్తివిద్యా కోర్సుల్లో ఈ అకాడమిక్ ఇయర్ స్పోర్ట్స్ కోటా అమలు చేయవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 7 కారణంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్ధులకు అన్యాయం జరుగుతోందని నీలేరాయ్, కాలేశ్రేయ అనే ఇద్దరు స్పోర్ట్స్ అభ్యర్ధులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్‌పై హైకోర్టు శుక్రవారం(జులై-6) విచారణ చేపట్టింది. ప్రొఫెషనల్ కోర్సుల్లో స్పోర్ట్సు కోటాను ఎత్తివేయాలని పిటీషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 7లో స్పోర్ట్స్ కోటాలో అనేక అక్రమాలు జరిగాయని న్యాయవాది కోర్టుకు చెప్పారు. దీంతో గత నెల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ -7పై కోర్టు స్టే ఇచ్చింది. ఏడాది పాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాను లెక్కలోకి తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. ఈ మేరకు జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ కే విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.

Posted in Uncategorized

Latest Updates