వృద్ధాశ్రమానికి తీసుకెళ్లాడని : 92 ఏళ్ల వయస్సులో.. 72 ఏళ్ల కొడుకును చంపింది

oldవృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారు ఈ న్యూస్ తెలిస్తే షాక్ అవుతారు. ప్రియురాలి మోజులో పడి తల్లిని నిర్లక్ష్యం చేయడమే కాక, నానా హింసలకు గురి చేశాడు ఓ కొడుకు. అంతటితో ఆగకుండా తల్లిని వదిలించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం సమీపంలోని ఓ వృద్ధాశ్రమంలో పడేయాలనుకున్నాడు. తీరా వృద్ధాశ్రమం దగ్గరకు చేరుకున్నాక.. ఎవరూ ఊహించని పని చేసింది ఆ బామ్మ. కొడుకును అతడి ప్రియురాలిని తుపాకీతోనే కాల్చి పారేసింది. ఈ సంఘటన అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగింది.

అరిజోనా రాష్ట్ర రాజధాని ఫియోనెక్స్‌ పట్టణం. ఫౌంటేన్‌ హిల్స్‌ లో 92 ఏళ్ల  అన్నా మే బ్లెస్సింగ్‌, తన కొడుకు(72)తో జీవిస్తోంది. ఆరు నెలలుగా ఓ అమ్మాయి(25 ఏళ్ల లోపు)తో ఆ పెద్దాయన డేటింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నా.. ఆమె సహించింది. కొడుకు ప్రియురాలు అవమానిస్తున్నా.. భరిస్తూ వచ్చింది. చివరకు ఆమెను వృద్ధాశ్రమానికి తరలించాలని యత్నించటంతో తట్టుకోలేకపోయింది.

తల్లిని ఓల్డేజ్‌ హోమ్‌ కు తీసుకెళ్లాడు. దీన్ని సహించలేకపోయింది ఆ బామ్మ.  ప్రియురాలి దగ్గర ఉన్న తుపాకీతోనే కొడుకు, అతని ప్రియురాలిపై కాల్పులు జరిపింది. కొడుకు మెడలోంచి బుల్లెట్లు దూసుకుపోవటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రియురాలు తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి.. కొడుకు శవం ముందు ఆ తల్లి ఈ వీల్‌ ఛైర్‌ లో కూర్చుని ఉంది. తన జీవితాన్ని నువ్వు లాగేసుకున్నావ్‌.. ఇప్పుడు నీ బతుకును నేను తీసేసుకున్నా అంటూ ఆమె కంటతడి పెట్టుకుంది. జరిగిందంతా అక్కడున్న వారికి వివరించింది. వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆమె తరపున కేసును ఉచితంగా వాదించేందుకు ఓ న్యాయవాది ముందుకు రావటం విశేషం. ఈ సంఘటనపై బామ్మను మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినవారికి తగిన గుణపాఠం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates