వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌లో దొంగల బీభత్సం

Vతిరుపతి-కాచిగూడ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు స్టేషన్‌ దగ్గర గురువారం(జూన్-21) అర్ధరాత్రి దొంగలు సిగ్నల్‌ తీగలు కట్‌ చేశారు. దీంతో  రైలు  స్టేషన్ కు కిలోమీటర్ దూరంలో ఆగిపోయింది. ఇదే అదనుగా భావించి S-5, Sస్‌-6 బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికులను కత్తులతో బెదిరించి రూ.5లక్షలు విలువ చేసే నగలు, నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates