వెంకయ్య క్లారిటీ: ఇంగ్లీషు మైండ్ ఓ రోగం..భాష కాదు

ఇంగ్లీషు భాషపై క్లారిటీ ఇచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బ్రిటిష్ వాళ్లు వదిలి వెల్లిన ఇంగ్లీష్ మైండ్ ఓ రోగం లాంటిదని..భాష కాదన్నారు. శుక్రవారం జరిగిన గోవా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 4వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు వెంకయ్య.  గతంలో ఇంగ్లీష్ భాషపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సెప్టెంబర్ 14న ఢిల్లీలో జరిగిన హిందీ డే ఈవెంట్ సందర్భంగా బ్రిటిష్ వాళ్లు వదిలి వెళ్లిన  ఇంగ్లీష్ అనేది ఒక రోగం అని  వెంకయ్య నాయుడు అన్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే తాను అనలేదని …. ఇంగ్లీష్ మైండ్ సెట్ గురించి మాత్రమే తాను మాట్లాడినట్లు స్పష్టం చేశారు. భారత్‌ యొక్క ఘనమైన చరిత్ర సంస్కృతి పట్ల ప్రతి ఒక్కరం గర్వపడాలన్నారు.

బ్రిటీషు వారు దేశాన్ని విడిచి వెళ్లారని కానీ …వారే గొప్పవారు, విదేశీయులే గొప్పవారు… భారతీయులుగా మనం ఏమీకాదనే భావన కలిగించి వెళ్లారని అన్నారు. ఈ భావన నుంచి మనం బయటకు రావాలని చెప్పారు. భారత్‌ ఎవరిపై దండెత్తలేదని… భారత్ పైనే కొందరు దాడి చేశారని గుర్తుచేశారు.

పర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదన్న వెంకయ్య… ఎన్ని భాషలు కావాలంటే అన్ని నేర్చుకోవచ్చన్నారు. పోర్చుగీస్, చైనీస్, రష్యన్, ఇలా నేర్చుకోవడంలో తప్పులేదన్నారు. కానీ మన చర్చలు డిబేట్లు మాత్రం మాతృభాషలోనే చేద్దామన్నారు. ఇప్పటి వరకు రాజ్యసభలో 22 భాషలు మాట్లాడేందుకు తాను అనుమతించినట్లు చెప్పిన వెంకయ్య ఇందులో గోవాకు చెందిన కొంకని భాష కూడా ఉందన్నారు.

Posted in Uncategorized

Latest Updates